'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మరోసారి షాక్ ఇచ్చిన హైకోర్టు

  • సినిమాను వీక్షించిన హైకోర్టు జడ్జిలు
  • తీర్పును సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు
  • నిరాశకు గురైన దర్శకనిర్మాతలు
ఏపీ మినహా మిగిలిన ప్రాంతాల్లో విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఓ వర్గానికి సంబంధించిన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలపై ఈ చిత్రం ప్రభావం చూపిస్తుందని కొందరు కోర్టును ఆశ్రయించడంతో... ఇంత వరకు ఏపీలో ఈ చిత్రం విడుదల కాలేదు. పోలింగ్ మరుసటి రోజైన 12వ తేదీన (రేపు) చిత్రాన్ని ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న సినిమా దర్శకనిర్మాతలకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈరోజు ఈ చిత్రాన్ని ఏపీ హైకోర్టు ఛాంబర్ లో జడ్జిల కోసం ప్రదర్శించారు. సినిమాను చూసిన తర్వాత... తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో దర్శకనిర్మాతలు నిరాశకు గురయ్యారు.
Go Back to Shorts
lakshmis ntr
release
ap
high court

More Telugu News